Saturday, July 27, 2024
Homeతెలంగాణకుంగిన బ్యారేజ్ ను చూడటానికి రాహుల్ గాంధీ రావాలా ?

కుంగిన బ్యారేజ్ ను చూడటానికి రాహుల్ గాంధీ రావాలా ?

కుంగిన బ్యారేజ్ ను చూడటానికి రాహుల్ గాంధీ రావాలా ?

ఏఐసీసీ సెక్రెటరీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని అక్టోబర్ 22 (కలం శ్రీ న్యూస్):మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన ప్రమాదంపై మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పందించారు.మేడిగద్ద బ్యారేజ్ వంతెన ఒక్కసారిగా కొంతమేర కుంగింది. శనివారం సాయంత్రం సమయంలో భారీ శబ్ధంతో బి- బ్లాక్ లోని 18 ,19,20,21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. అయితే.. ఈ విషయంపై మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం లోపభూయిష్టమని దీనికి ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధ్యత వహించాలని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.తక్కువ సమయంలో నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కుంగిపోయిన బ్యారేజ్ పై ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు.ప్రజల సొమ్మును నీళ్లలో పోశారని ఆగ్రహించారు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.

ఇంజనీరింగ్ అధికారులు చేసిన తప్పిదాన్ని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ,ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధ్యత వహించాలన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలని,రీ డిజైనింగ్ సరికాదని చెప్పాము,ఇది మానవ తప్పిదం అంటూ ఫైర్‌ అయ్యారు.కుంగిన బ్యారేజ్ లను మా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చూడడానికి రావాలా అని ఎద్దేవా చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!