బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ,మాజీ జడ్పిటిసి సీడం బాపు
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 21 (కలం శ్రీ న్యూస్):జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండల కేంద్రానికి చెందిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు మాజీ జెడ్పిటిసి బిజెపి నాయకులు సీడం బాపు శనివారం బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జి ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు గులాబి కండువా కప్పి పార్టీలో ఆహ్వానించి నోరు తీపి చేశారు.మంథని నియోజకవర్గంలో బిజెపి టిక్కెట్ సునీల్ రెడ్డికి రావడంలేదని ప్రచారం జరుగుతుండడంతో బిజెపీ పార్టీ వీడారు.మొదటి 5 అంచల వ్యవస్థలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మారుమూల మండలం మహాముత్తారం గ్రామానికి చెందిన సీడం బాపు గిరిజన నాయకుడు మాజీ జడ్పిటిసి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీలో చిన్న చూపు, గుర్తింపు లేకపోవడంతో బిజెపి పార్టీలో చేరి పార్టీ ఎదుగుదలకు కృషి చేశారు. మంథని నియోజక వర్గంలో బిజెపి పార్టీలో బహుజన నాయకులకు గుర్తింపు లేకపోవడం క్యాడర్ ను పెంచుకోకపోవడంతో బిజెపి పార్టీని వీడినట్లు మాజీ జెడ్పిటిసి సీడం బాపు ఆదివాసి తెలిపారు.మహ ముత్తారం మండల కేంద్రానికి చెందిన శ్రీరామ్ రాజబాబు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మందల రాజిరెడ్డి, కాటారం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి బానోతు జగన్నాయక్,మంథని నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు పెరటి సత్తిరెడ్డి పాల్గొన్నారు.