దుర్గామాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని,అక్టోబర్ 21(కలం శ్రీ న్యూస్):దేవీశరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం కమాన్‌పూర్ మండలంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.అలాగే మండలంలోని జూలపల్లి, కమాన్ పూర్,గుండారం,పేరపల్లి, రొంపికుంట,నాగారం లలో ప్రతిష్టించిన దుర్గామాతను ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా ఉత్సవ కమిటి సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.