Friday, September 20, 2024
Homeతెలంగాణఎన్నికలు వస్తే ఏదైనా చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే

ఎన్నికలు వస్తే ఏదైనా చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే

ఎన్నికలు వస్తే ఏదైనా చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే 

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని అక్టోబర్ 20 (కలం శ్రీ న్యూస్):అనేక ఏండ్లు దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు బీసీల ఊసేత్తకుండా అణిచివేసి ఈనాడు బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఎద్దేవా చేశారు. శుక్రవారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు బీసీల గురించి ఆలోచనచేయకుండా బీసీల లెక్కలు తీయకుండా ఈనాడు బీసీల గురించి మాట్లాడుతున్న తీరును బీసీలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన బీసీసామాజిక వర్గానికి చెందిన వి హనుమంతరావు, డి శ్రీనివాస్‌ లాంటి నాయకులు ముఖ్యమంత్రి దాకా వచ్చి వెనకకు నెట్టివేయబడ్డారని,పొన్నాల లక్ష్మయ్యకు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వని దుస్థితి కాంగ్రెస్‌దన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో బీసీల రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేరని,ఎవరైనా రాజకీయంగా ఎదిగితే వారిని రాజకీయ సమాధిచేస్తారని ఆయన విమర్శించారు. ఒక్క కాంగ్రెస్‌ పార్టీలోనే కాకుండా ఇతర పార్టీల్లో సైతం బీసీలు ఎదిగితే వారిని అణిచివేయడం కాంగ్రెస్‌కు అలవాటేనని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తే ఓట్ల కోసం ఏదైనాచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. ఓట్ల కోసం జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తులు అబద్దాలు,మోసాలు చేయడానికి వెనుకాడరని ఆయన అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని జాతీయ స్థాయి నాయకులు రాహుల్‌గాంధీ బస్సు యాత్ర చేపట్టడం ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌పార్టీ చేపట్టిన బస్సు యాత్రలో బాగంగా మంథని మీదుగా రాహుల్‌ గాంధీ యాత్రలో ఆయన ఉపన్యాయంపై ప్రజలు అయోమయానికి గురయ్యారని, రాహుల్‌ గాంధీ ఏం చెప్పారో ట్రాన్స్‌లేటర్‌గా ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చెబుతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. ఒక జాతీయ స్థాయి నాయకులు వస్తే కాటారం కేంద్రంలో ఐదు నుంచి ఆరువేల మంది మాత్రమే కన్పించడాన్ని చూస్తే కాంగ్రెస్‌పార్టీ చతికిలపడ్డట్లు అర్థం అవుతోందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ బీసీల గురించి మాట్లాడటానికి బీసీ సామాజికవర్గాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఇప్పటికే బీసీల లెక్కలు సీఎం కేసీఆర్‌ ఎప్పుడో ప్రకటించారని, జనబా లెక్కల్లో అత్యధిక శాతం ఉన్న బహుజనుల రాష్ట్రమని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.అంతేకాకుండా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారని, రాష్ట్రంలో బీసీలు,ఎస్సీలు,ఎస్టీలు దాదాపు 80శాతం ఉన్నారని ప్రకటించడం జరిగిందని, బీసీ కులగణన చేయమని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ తీర్మాణాన్ని పార్లమెంట్‌కు పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీసీల సంక్షేమం గురించి నిరంతరం ఆలోచన చేసే సీఎం కేసీఆర్‌ అని ఆయ కొనియాడారు.కాంగ్రెస్‌,బీజేపీ పార్టీలు ఏనాడు అభివృధ్ది కావాలని ఆలోచన చేయలేదని ఆయన విమర్శించారు.అణగారిన వర్గాలను వెనకబాటుకు గురి చేయడంలో రెండు పార్టీల నాయకులు పోటీ పడుతారని ఆయన అన్నారు. రాహుల్‌ గాంధీ బస్సు యాత్ర సందర్బంగా మంథని మీదుగా వెళ్తూ మంథని నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మన దేశ మొదటి ప్రధానిగా అయిన స్వర్గీయ పీవీ నర్సింహరావు గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పీవీ నర్సింహరావు అంత్యక్రియలు చేయకుండా అవమానించింది కాంగ్రెస్‌ పార్టీ గాంధీ కుటుంబమేనని ఆయన విమర్శించారు. దేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన పీవీ నర్సింహరావు గురించి ప్రస్తవించకుండా చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికే చెల్లుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎవరిని గౌరవించదని, ముఖ్యంగా బీసీలను గౌరవించని వాళ్లు ఈనాడు బీసీల గురించి మాట్లాడుతున్నారంటే ఎన్నికల ఎత్తుగడగా బీసీలంతా అర్థం చేసుకోవాలని ఆయన వివరించారు. ఐదేండ్లుగా ఒక్కరికి మంచినీళ్లు పోయనోళ్లు ఈనాడు ఎన్నికల వస్తున్నాయని డబ్బు సంచులతో వచ్చి నోట్లు వెదజల్లుతున్నారని, రాహుల్‌ గాంధీ బస్సు యాత్ర సందర్బంగా డబ్బులు, మందు, మాంసం సప్లై చేశారని ఆయన ఆరోపించారు. అధికారం, ఓట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఏమైనా చేస్తుందని, రాహుల్‌ గాంధీ సభను చూస్తే అర్థం అవుతుందన్నారు.కర్ణాటకలో సంపాదించిన డబ్బులను ఇక్కడ ఖర్చు చేసి అధికారం కోసం ఆరాటపడుతున్నారని, ఈ విషయాన్ని ఐదు మాసాల క్రితమే తాను చెప్పానని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కలకలలాడుతుంటే మళ్లీ చీకట్లోకి గెంటివేయాలనే ఆలోచనలు కాంగ్రెస్‌ చేస్తుందని, కాంగ్రెస్‌ పార్టీని, వాళ్లు ఇచ్చే హమీలను నమ్మితే కర్ణాటక తరహాలో మోసపోయి గోసపడక తప్పదని ఆయన చెప్పారు. ఎన్నికల కోసం బీసీల మాట మాట్లాడుతున్న కాంగ్రెస్‌ మోసాలను, కపట ప్రేమను బీసీలంతా గుర్తించాలని ఆయన ఈ సందర్బంగా కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!