Saturday, July 27, 2024
Homeతెలంగాణకేసీఆర్‌ అంటేనే నమ్మకం...కొండంత ధైర్యం

కేసీఆర్‌ అంటేనే నమ్మకం…కొండంత ధైర్యం

కేసీఆర్‌ అంటేనే నమ్మకం…కొండంత ధైర్యం

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని అక్టోబర్ 20(కలం శ్రీ న్యూస్):తొమ్మిదేండ్ల పాటు రాష్ట్రంలో సుపరిపాలన అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటే ప్రజలకు ఒక నమ్మకం కొండంత ధైర్యమని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ అన్నారు.శుక్రవారం మంథని మండలం కన్నాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనీఫెస్టో,నామినేషన్‌ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికి బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనీఫెస్టో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కన్నాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో పూజలు చేయడం,ఎన్నికల ప్రచారాన్ని స్వామివారిని దర్శించుకునే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోందని, స్వామివారి కృపతో మంచి జరుగుతుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉందన్నారు.ఈక్రమంలోనే కన్నాల ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ముందుగా ఈ గ్రామ ప్రజల ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుందన్నారు.ఎన్నికలు వస్తున్నాయంటేనే ఇతర పార్టీలు ఒక ఆటలాగా బావిస్తాయని,కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ఎన్నికలు ప్రజల ఆకలి తీర్చేవని బావిస్తారని అన్నారు. తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ది,సంక్షేమ పథకాలను చూసిన ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారని,కన్నవాళ్లు కదన్నా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పించన్‌ డబ్బులతో మంచిగా బతుకుతున్న బిడ్డా అంటూ ఓ తల్లి చెప్పిన తీరును చూస్తేనే అర్థం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి ముందుచూపుతోనే అనేక పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈనాడు ఎన్నికల వస్తున్నాయని కాంగ్రెస్సోళ్లు కుర్చీ కోసం ఆరు అబద్దాల పథకాలను చెబుతున్నారని, ఏ ఒక్క పథకం గ్యారెంటీ వారంటీ ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రవేశపెట్టిన ఎన్నికల మానీఫెస్టోతో పాటు తాను సొంతంగా ఓ మేనీఫెస్టోకు రూపకల్పన చేశానని, ప్రభుత్వ ఫలాలతో పాటు తాను సొంతంగా మరిన్ని సేవలు అందిస్తానని అన్నారు.బీఆర్‌ఎస్‌ పార్టీ ఐదేండ్లలో రెట్టింపు పించన్‌లు, రూ.400లకే గ్యాస్‌ సిలిండర్‌, సన్నబియ్యంలాంటి పథకాలతో పాటు గుంట భూమి ఉన్న రైతుకు ఎలా భీమా వర్తింపజేస్తుందో అదేరీతిలో ప్రతి ఒక్క కుటుంబానికి భీమా అందించేలా ఏర్పాట్లు చేస్తుందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం పెంచి వ్యవసాయానికి అండగా నిలుస్తుందన్నారు.ప్రతిపేదవాడి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక దృష్టిసారించిన సీఎం కేసీఆర్‌ ఆరోగ్యశ్రీని రూ.15లక్షలవరకు పెంచారని ఆయన వివరించారు. ఇలాంటి గొప్ప మేనీఫెస్టోతో పాటు తాను సొంతంగా మరిన్ని సేవలు అందించేందుకు అన్నిచర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి ఆశీర్వదిస్తూ నాలుగేండ్లు తన తల్లి పేరు ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా అనేక సేవలు చేశామన్నారు. ప్రతి మండలంలో అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామని, ఆకలి తీర్చేలా అన్నం పెట్టామని,ఆడబిడ్డల పెండ్లిళ్లు చేశామని,చదువులు చెప్పించామన్నారు.అదే రీతిలో రాబోయే రోజుల్లో ఉన్నత చదువులు చదువుకునే పేదబిడ్డలకు హైదరాబాద్‌లో ఉచితంగా వసతి కల్పించి రూపాయి ఖర్చు లేకుండా చదివించే బాధ్యత తీసుకుంటానని, అదే విధంగా ప్రతి ఏటా పేదింటి ఆడబిడ్డల పెండ్లి పుస్తె మట్టెలు అందించి పుట్టింటి వారిలా అంగరంగవైభవంగా వివాహం జరిపిస్తానని అన్నారు.అంతేకాకుండా నియోజకవర్గంలో ఎంతో మంది నిరుపేదలు ఇండ్లు లేకుండా ఉన్నారని, గత కాంగ్రెస్‌ ఫ్రభుత్వంలో ఇందిరమ్మ పథకం పేరుతో ఇండ్లు మాయం చేశారని, అలాంటి దుస్థితి లేకుండా ప్రభుత్వం అందించే గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఇళ్లు మంజూరీ చేయించి ప్రభుత్వం ఇచ్చే మూడు లక్షలతో పాటు తాను కొంత కలిపి ఇండ్లు నిర్మించి దగ్గరుండి బట్టలు పెట్టి గృహప్రవేశం చేయిస్తామని ఆయన హమీ ఇచ్చారు.ఇలా తాను అనేక సేవలు చేస్తుంటే కాంగ్రెస్సోళ్లు దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 40ఏండ్లు అధికారంలో ఉండి ఈ ప్రాంత ప్రజలకు ఏమీ చేయనోళ్లు ఇనాడు కాంగ్రెస్‌ ఎన్నికల మేనీఫెస్టోను మాత్రమే అమలు చేస్తామని చెబుతున్నారే కానీ ఇన్నేండ్లు ప్రజల ఓట్లతో గెలిచినోళ్లు సొంతంగా ప్రజలకు ఏం చేస్తరో చెప్తలేరని ఆయన ఎద్దేవా చేశారు. పేద ప్రజలకు ఏం చేస్తరని అడిగితే తనను బదనాం చేస్తున్నారని ఆయన వాపోయారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లతో అధికారం, పదవులు పొందిన కుటుంబం ఆనాడే అమెరికాకు పోయి సాప్ట్‌వేర్‌ కంపెనీ పెట్టుకున్నారే కానీ ఈ ప్రాంతానికి చెందిన ఏ ఒక్కరికి ఉపాది కల్పించలేదని అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో తనలాంటి వాళ్లు రాజకీయంగా ఎదిగితే అనేక కుట్రలు కుతంత్రాలతో రాజకీయ సమాధి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి నాయకులను నమ్మితే గోసపడక తప్పదని, కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హమీలను నమ్మి అక్కడి ఓట్లువేసి గెలిపిస్తే ఆనాడు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్‌ పాలనతో అక్కడి ప్రజలు ఆగమైతాండ్లని ఆయన అన్నారు. కుర్చీ కోసమే ఆరు అబద్దపు పథకాలతో మన ముందుకు వస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ వ్యవసాయరంగానికి పెద్దపీట వేసి ఎక్కడా లేని విధంగా 24గంటల ఉచిత కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్సోళ్లు మూడు గంటల కరెంటు చాలు అన్నారని, పీసీసీ అధ్యక్షుడు తన మనస్సులో మాట బయటపెట్టిన విషయం అందరికి తెలిసిందేనని అన్నారు. అంతేకాకుండా ఈనాడుకర్ణాటక రాష్ట్రంలో ఐదు గంటల కరెంటుకంటే ఎక్కువ ఇయ్యలేమంటూ ముఖ్యమంత్రి చెప్పినట్లు స్వయంగా ఆ శాఖ మంత్రి ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజలను మోసం చేయాలనే ఆలోచనతో మంథనికి రాహుల్‌గాంధీని తీసుకువచ్చారని, మంథని మీదుగా వెళ్లిన రాహుల్‌గాంధీ పాత పెట్రోల్‌బంక్‌ సమీపంలోని బారత మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహరావు విగ్రహం వైపుకన్నెత్తిచూడలేదని, మంథని ప్రాంతం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రధాని స్థాయికి చేరుకున్న గొప్ప నాయకుడని, దేశానికి ఆర్థికసంస్కరణలు తీసుకువచ్చిన పీవీ నర్సింహరావు గురించి రాహుల్‌ గాంధీ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం పీవీ విగ్రహానికి పూలమాల వేయకపోవడం ఆ పార్టీ తీరుకు అద్దం పడుతోందన్నారు. సొంత పార్టీ నాయకుల గొప్పతనాన్ని గుర్తించని వాళ్లు ప్రజలకు ఏం మేలు చేస్తారని ఆయనప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ, ఒక్క కుటుంబ పాలనపై ప్రజలు ఆలోచన చేయాలని, ప్రజల్లో చైతన్యతీసుకువచ్చేందుకు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మహనీయుల చరిత్రను తెలుసుకుని వారి స్మరించుకోవాలని చెబుతుంటే కాంగ్రెస్సోళ్లు మా కుటుంబ చరిత్రను తెలుసుకోవాలే, మా విగ్రమాలకు దండంపెట్టాలని ఆలోచనలు చేస్తున్నారని ఆయన అన్నారు. కులాలు మతాలకు అతీతంగా బీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌ గొప్పగా ఆలోచన చేసి అన్ని వర్గాలకు మేలు చేసేలా పథకాలను అమలుచేస్తున్నారని, అలాంటి పార్టీ, సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాల్సిన అవసరం ఉందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఆశీర్వదించి ఆదరించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!