మంథనిలో బీజేపీ పార్టీ గెలుపుని ఎవ్వరు ఆపలేరు
కర్ణాటక ఎమ్మెల్సీ కేశవ్ ప్రసాద్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 20 (కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బీజేపీ పార్టీ ఆఫీస్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా కర్ణాటక ఎమ్మెల్సీ కేశవ్ ప్రసాద్,పార్లమెంట్ కన్వీనర్ మల్లికార్జున్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. మల్హర్ రావ్ మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన పలువురు మహిళలు పార్టీ లో చేరారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కార్యకర్తలు మరింతగా కష్టపడి పని చేయాలని,మంథనిలో బిజెపి గెలుపుని ఎవరు ఆపలేరని,బిజెపి పార్టీకి కార్యకర్తలే వెన్నుముక, గతంలో కంటే మంథని ప్రాంతంలో బిజెపి మరింత బలపడుతుందని, ప్రజలు అవినీతి బిఆర్ఎస్, అసమర్థ కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్నారని ఈసారి బిజెపి పార్టీకి పట్టం కట్టాలని భావిస్తున్నారని ప్రతి ఒక్క కార్యకర్త కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను సామాన్య ప్రజలకు క్లుప్తంగా వివరించి బిజెపి పార్టీని గెలిపించాలని ప్రచారం చేయాలని, ఆవాస్ యోజన,ఆయుష్మాన్ భారత్,గ్రామీణ సడక్ యోజన,ఈ శ్రమ్ కార్డ్,రైతు వేదికలు,అన్ని కేంద్ర పథకలని,కరోనా కష్ట కాలం లో ఉచిత టీకాలు,రేషన్ ఇచ్చి ప్రజలకు భరోసా కల్పించిదని అన్నారు.ఈ కార్యక్రమం లో అసెంబ్లీ కన్వీనర్ మల్క మోహన్ రావు, కో నాంపల్లి రమేష్,రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ కొండా పాక సత్య ప్రకాష్, జిల్లా అధికార ప్రతినిధి పోతారవేణి క్రాంతి కుమార్,చింతకాని ఎంపీటీసీ ఉడుముల విజయ రెడ్డి, మండలల అధ్యక్షులు విరబోయిన రాజేందర్, పెయ్యాల కుమార్, జంగపల్లి అజయ్,ముడతన పల్లి ప్రభాకర్, బొమ్మన భాస్కర్ రెడ్డి, పిలుమారి సంపత్, సిరిపురం శ్రీమన్నారాయణ,కోయల్కార్ నిరంజన్,పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి,అన్ని మండలల ఇంచార్జ్ లు,ప్రధాన కార్యదర్శులు సీనియర్,నాయకులు పాల్గొన్నారు.