ప్రజలను ఇబ్బందిపెడ్తే సహించేది లేదు
ఆర్టీసీ అధికారుల తీరుపై జెడ్పీ చైర్మన్ అసహనం
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 20 (కలం శ్రీ న్యూస్ ):ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌చైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. శుక్రవారం మంథని ఆర్టీసీ డిపో పరిధిలోని భూములకు ఆ సంస్థ అధికారులు హద్దులు పెడుతున్న క్రమంలో సమీప ఇంటి నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అనేక ఏండ్ల క్రితమే గ్రామపంచాయతీ నుంచి స్థానికులకు హద్దులు కేటాయించారని,ఆనాడు ఇంటి నిర్మాణాలు జరుగుతున్న క్రమంలో ఆర్టీసీ అధికారులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఒక పేదవాడు ఇళ్లు నిర్మించుకుంటే సహకారం అందించాల్సింది పోయి ఈనాడు హద్దుల పేరుతో ఇబ్బందులు పెడుతారా అంటూ ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అనాడు అనుమతులు ఇచ్చిన వారిపై ఫిర్యాదు చేయాలని,సంస్థ భూములకు సంబందించి రికార్డులతో మున్సిపల్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి సర్వే చేసుకోవాలని, ఎవరూ లేకుండా ఇలా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆయన అన్నారు.