దుర్గ మాత మండపం వద్ద అన్నదానం
సుల్తానాబాద్, అక్టోబర్ 20 (కలం శ్రీ న్యూస్):దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని జవహర్ నగర్ లో భక్తులకు అన్నదానం నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని నిత్యం వివిధ రూపాలలో పూజించి అమ్మవారిని కొలుస్తారు. వివిధ రూపాలలో దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని ఓడి బియ్యం, సారే తో పాటు మహిళలు భక్తిశ్రద్ధలతో దేవిని పూజిస్తున్నారు. శుక్రవారం అమ్మవారికి వివిధ రకాల పూజలు నిర్వహించిన అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ జెడ్పిటిసి ఐల రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆకుల కరుణాకర్, వార్డ్ కౌన్సిలర్ దున్నపోతుల రాజయ్య, జవహర్ యూత్ క్లబ్ ప్రతినిధులు పెగడ పరుశరాములు, పెగడ చందు, ఎల్ల రాజు, ఆకుల విష్ణు వర్ధన్, శెట్టి శ్రీనివాస్ ,ఆకుల సాయి, కొయ్యడ సాయికుమార్ ,శివకుమార్, జయవర్ధన్, సన్నీ, ఆకుల అంజయ్య, కొయ్యడ విజయ, ఆకుల స్వరూప, మౌనిక, శిరీష, సరోజ, శోభారాణి లతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పలువురు పాల్గొన్నారు.