Saturday, July 27, 2024
Homeతెలంగాణబీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల దొంగ హామీలకు మోసపోకండి 

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల దొంగ హామీలకు మోసపోకండి 

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల దొంగ హామీలకు మోసపోకండి 

బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష

కాల్వ శ్రీరాంపూర్,అక్టోబర్20(కలం శ్రీ న్యూస్):కాల్వ శ్రీరాంపూర్ మండలo మంగపేట గ్రామంలో నేడు 60వ రోజు మన ఊరు మన ఉష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఎస్పీ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష హాజరై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ఏనుగు గుర్తును పరిచయం చేస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీని ప్రజలకు వివరిస్తూ బీఎస్పి అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు.

అనంతరం దాసరి ఉష  మాట్లాడుతూ 10 సంవత్సరాలలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మంగపేట గ్రామానికి కనీసం రోడ్లు, కరెంటు స్తంభాలు కూడా వేయలేని దుస్థితి బీఆర్ఎస్ పాలనలో చూసామని, గతంలో ఐదు సంవత్సరాలు టిడిపి నుండి ఎమ్మెల్యేగా చేసిన చింతకుంట విజయరమణారావు కూడా పెద్దపల్లి నియోజకవర్గ యువకులకు, మహిళలకు, రైతులకు చేసిందేమీ లేదన్నారు. పెద్దపల్లి పట్టణంలో డేటా సైన్స్ ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటుచేసి మంగపేట గ్రామం నుండి కెక్కెర్ల శ్రీవిద్య, కాసగోని శ్రీలేఖ, న్యాల అనూష అనే యువతి యువకులకు మంగపేట గ్రామం నుండే కాకుండా పెద్దపల్లి నియోజకవర్గం నుండి 120 మంది యువకులకు ఉచితంగా లక్షలలో సంపాదించుకునేలా ఉద్యోగలు కల్పించామన్నారు. అధికారం లేక ముందే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి నేడు మీ ముందుకు వచ్చి ఓటు అడిగే అర్హత పొందామన్నారు. పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దాసరి మనోహర్ రెడ్డి, ఐదు సంవత్సరాలు టిడిపి ఎమ్మెల్యేగా చేసిన చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి ప్రజలకు ఏం చేశారో తెలియజేయాలని ప్రశ్నించారు? ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల దొంగ హామీలకు మోసపోవద్దన్నారు. ఒక బీసీ బిడ్డగా మహిళగా బహుజనుల కోసం పోరాడుతూ అనునిత్యం ప్రజల వెంట ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసం పోరాడే బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ కోశాధికారి ఎండి రియాజ్, కాల్వ శ్రీరాంపూర్ మండల కోశాధికారి రాము, కాల్వ శ్రీరాంపూర్ గ్రామ మహిళా కన్వీనర్ కుమ్మరికుంట శారద, ఓదెల మండల నాయకులు బీరం రవి, సందీప్, స్థానిక గ్రామస్థులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!