సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలే
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 19(కలం శ్రీ న్యూస్):తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత యువతరంపై ఉందని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ అన్నారు. గురువారం రామగిరి మండలం వెంకట్రావ్ పల్లి గ్రామంలో శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో బాగంగా ఏర్పాటు చేసిన దుర్గాదేవిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత 30ఏండ్లుగా వెంకట్రావు పల్లి గ్రామంలో పెద్దలు ఉత్సవాలు జరిపేవారని,ఈనాడు యువతరం దుర్గామాత ఉత్సవాలను నిర్వహిస్తున్నారని అన్నారు. నేటి యువతరం చెడు మార్గాల వైపు పోకుండా నిష్టగా అమ్మవారి దీక్ష తీసుకుని సన్మార్గంలో నడువాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామాన్ని మంచి మార్గంలో నడిపించేలా యువత ఆలోచన చేయడం గొప్పదని, గ్రామాభివృధ్ది కోసం తనవంతుసహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆనాడు 2009లో గ్రామానికి వచ్చిన సమయంలో తనకు అపూర్వ స్వాగతం పలికారని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో యువత ముఖ్యపాత్ర పోషించాలని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.