బి అర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసిన చల్లా నారాయణ రెడ్డి
మంథని,అక్టోబర్19(కలం శ్రీ న్యూస్):మంథని నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రాథమిక సభ్యత్వ రాజీనామా చేసిన చల్లా నారాయణ రెడ్డి.
రాజీనామా అనంతరం వారు మాట్లాడుతూ…. చల్లా నారాయణ రెడ్డి అనే నేను, మీ పిలుపు మేరకు అప్పటి తెరాస ఇప్పటి బి అర్ ఎస్ పార్టీలో 2017లో చేరడం జరిగింది. నేను అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాటారం మండల జడ్పీటీసీ గా, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నాను. పార్టీలో చేరినప్పటి నుండి ఈ రోజు వరకు పార్టీ కోసం అంకిత భావంతో, చిత్తశుద్ధితో పని చేశాను. కానీ నా అనుభవాన్ని, సుదీర్ఘ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకొని అయిన నాకు పార్టీ సముచిత స్థానం కల్పించలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో 5మండలాలు కాంగ్రెస్ పార్టీకీ కంచు కోట అయిన కాటారం మండలంలో బి అర్ ఎస్ పార్టీ నీ జడ్పీటీసీ గా నేను నా బుజ స్కందాల మీద వేసుకొని గెలిపించాను.భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి 5మండలాలో ఒక్కటి అంటే ఒక్క బి అర్ ఎస్ పార్టీ అభ్యర్థి కూడా గెలవలేదు కానీ నాకు అప్పగించిన బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో బి అర్ ఎస్ పార్టీ లేని మండలంలో బి అర్ ఎస్ పార్టీ జెండా ఎగురవేసా,కాటారం మండలం నుండి ప్రతినిత్యం వహిస్తున్న జడ్పీటీసీని భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ గా మీరు నియమించారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి బి అర్ ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినా తర్వాత 2019లో కమాన్ పూర్ జడ్పీటీసీ గా టికెట్ ఇచ్చిన తర్వాత పూర్తి నిబద్దతతో పని చేసి గెలవని సీట్ ని నా పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వ్యక్తిగా అక్కడ మీరు నిలబెట్టిన అభ్యర్థని గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించాను. దాని తర్వాత వచ్చిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పని చేసి మంథని మున్సిపాలిటీలో బి అర్ ఎస్ పార్టీ జెండా ఎగురవేశ కానీ కనీసం గుర్తింపు లేదు.
తెలంగాణ రాష్ట్రం లో ఇటీవలే 2023 ఎలక్షన్స్ గాను మంథని నియోజకవర్గ టికెట్ కేటాయించిన తీరు నన్ను, మంథని ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది. మంథని నియోజకవర్గంలో అడుగు భూమి లేని ఓ ప్రజాప్రతినిధి ఈ రోజు వందల ఎకరాలు, వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి, నడి రోడ్డు మీద వామన్ రావు లాయర్ దంపతులను హత్య చేపించి, ఒక దళిత యువకుడి మర్మాంగాలను కోసి చంపించి, ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో బెదిరిస్తూ కార్యకర్తలను బానిసలుగా చూస్తూ, ప్రజా ప్రతినిధులను బెదిరిస్తూ, మానసిక క్షోభకీ గురి చేస్తూ, ఇసుక మాఫియా, భూకబ్జాలు చేస్తూ, డబ్బు పవర్ ఉంటే ఎన్ని హత్యలు చేసిన, అరాచకాలు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవచ్చు అనీ, నాకు ఎదురు ఎవరు లేరు అనీ నియంత పాలన చేస్తున్న వారిని కనీస చర్యలు తీసుకోకుండా మళ్ళీ కీలక (ఎమ్మెల్యే టికెట్) బాధ్యతలు అప్పగించి ప్రోత్సహించడం, నన్ను, మంథని నియోజకవర్గ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.అదే విధంగా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు గత నెల సెప్టెంబర్ 22తేదీన కెటిఆర్ ని కలిసినప్పుడు వారు ఎమ్మెల్సీ పదవి ఇస్తాను అనీ మాట ఇచ్చారు. కానీ నాకు ఎమ్మెల్సీ పదవి ముఖ్యం కాదు, మంథని నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అవమానం పడుతూ, భయబ్రాంతులకు గురైతూ, ఆర్థికంగా చితికిపోయారు. వారికీ అన్ని రకాలుగా నేను అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను అనీ చెప్పి సున్నితంగా తిరస్కరించాను.తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం. కావున స్వలాభం కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ, చేయకూడని నేరాలు చేసే పార్టీ ద్రోహుల ఆధ్వర్యంలో నేను కలిసి పనిచేయలేను.కాబట్టి ప్రతి కార్యకర్తను, నాయకులను, నా మంథని ప్రజలను అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత నా కర్తవ్యం నా చివరి రక్తపు బొట్టు వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు, నా చర్మం వలిచి మంథని ప్రజలకు చెప్పులు కుట్టిస్తాను నా మంథని ప్రజలందరిని నా కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది.మంథని నియోజకవర్గంలో ఇక్కడ అధికార పార్టీ పదవులు అనుభవిస్తున్న నాయకుడు నరికి చంపుతాడు. అనే సంస్కృతిని ప్రాలదోలి కొత్త నాయకత్వానికి నాంది పలకాలని ప్రజలు వేచి చూస్తున్నారు. నేను మంథని నియోజకవర్గంలో గడప గడపకు మన నారాయణన్న కార్యక్రమంలో ప్రతీ గ్రామ గ్రామాన తిరిగి ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకొని, వారికి అండగా ఉన్నాను. ప్రజల్లో మార్పు మొదలైనది. మంథని ప్రజలంతా కొత్త నాయకత్వానికి నాంది పలకాలని చూస్తున్నారు. వారికి అండగ కష్ట సుఖాల్లో నేను తోడుంటా,అందువలన మంథని నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ, వారికి అండగా ఉండి, ప్రజాస్వామిక పాలన అందించే దిశగా మరో రాజకీయ పోరాటం చేయాలని నేను నిర్ణయించిన దృష్ట్యా ఈ సందర్భంగా బి అర్ ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని అన్నారు.