ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కి విశ్రాంతి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష
పెద్దపల్లి,అక్టోబర్19(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి పట్టణo 25వ వార్డు ఉదయ్ నగర్ లో 59వ రోజు మన ఊరు మన ఉష కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి బీఎస్పీ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష హాజరై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ఏనుగు గుర్తును పరిచయం చేస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీని ప్రజలకు వివరిస్తూ బీఎస్పి అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు
అనంతరం దాసరి ఉష మాట్లాడుతూ మాజీ టిడిపి ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతకుంట విజయరమణారావు ధాన్యం కొనుగోలు విషయంలో రైస్ మిల్లర్లను విమర్శిస్తూనే మిల్లర్ల అసోసియేషన్ చెంత చేరడం విడ్డూరంగా ఉందన్నారు. ఓవైపు రైస్ మిల్లర్లు రైతుల పొట్ట కొడుతుంటే, మీరు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై మీ అధికార దాహం కోసం కోట్ల రూపాయలు తీసుకుంటున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు? పెద్దపల్లి నియోజకవర్గ రైతాంగం ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తున్నారన్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు వారిని తిరస్కరిస్తున్నారని, దాసరి మనోహర్ రెడ్డి కి విశ్రాంతి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీని ఓడించి పెద్దపల్లి ప్రజలు బీఎస్పీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో బీఎస్పి జిల్లా అధ్యక్షులు గొట్టే రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు కాంపల్లి బాబు, అసెంబ్లీ కోశాధికారి ఎంపీ రియాజ్, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు రామిళ్ళ శారద, పెద్దపల్లి పట్టణ ఉపాధ్యక్షులు మాచర్ల బబ్లూ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి అజీమ్, బీఎస్పి మాజీ అసెంబ్లీ అధ్యక్షులు బొంకురి సాగర్, మాజీ ప్రధాన కార్యదర్శి బొంకురి అన్వేష్, బీవిఎఫ్ టీం మహిళలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు