Friday, July 19, 2024
Homeతెలంగాణసమాజానికి దిశా నిర్దేశకులు స్త్రీలు 

సమాజానికి దిశా నిర్దేశకులు స్త్రీలు 

సమాజానికి దిశా నిర్దేశకులు స్త్రీలు 

దైవజనులు విజయ అగస్టిన్

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్

మంథని అక్టోబర్ 18(కలం శ్రీ న్యూస్):: కుటుంబానికి, సమాజానికి దిశా నిర్దేశకులు స్త్రీలని పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలు ఎంతో శక్తివంతమైన పాత్ర పోషించారని హైదరాబాద్ నుండి వచ్చిన దైవజనురాలు విజయ అగస్టిన్, కరీంనగర్ నుండి వచ్చిన దైవజనురాలు మంజుల సుధాకర్ లు అన్నారు. బుధవారం మంథని పట్టణంలో సీయోను ప్రార్ధన మందిరంలో ఇంటర్నేషనల్ మిషన్స్ ఇండియా,ఫెలోషిప్ ఆఫ్ ఎవంజలికల్ చర్చస్ ఆధ్వర్యంలో 43వ క్రైస్తవ స్త్రీల వార్షికోత్సవ మహాసభలకు వారు ముఖ్య ప్రసంగీకులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బైబిల్ కుటుంబంలో స్త్రీలు ఎలా నడుచుకోవాలో,సమాజంలో స్త్రీలు ఎలా రాణించాలో చాలా విషయాలు ఉన్నాయన్నారు. నిత్యం బైబిల్ ను ధ్యానం చేసే స్త్రీలు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటారని సూచించారు.కుటుంబాన్ని ఆధ్యాత్మిక చింతనలో నడిపించాల్సిన బాధ్యత స్త్రీలదే అన్నారు. ఈ కార్యక్రమంలో సీయోను స్త్రీల సమాజం నాయకులు ఎంకె హేమలత అధ్యక్షత వహించగా మంథని మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అంకరి పద్మజా కుమార్, స్త్రీల కమిటీ నాయకులు వాసాల పెర్సిస్ డేవిడ్,సౌల్ల ప్రేమలత,రామగిరి సువార్త కుమార్ తో పాటు ఇండియా మిషన్ చర్చిల స్త్రీలు, పాస్టర్లు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!