బీజేపీ పార్టీ విజయంలో మహిళల పాత్ర కీలకం కావాలి
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 18(కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలోని బీజేపీ పార్టీ ఆఫీస్ లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడీ సమక్షంలో మహాదేవ్ పూర్ మండలం కన్నెపల్లి,కాటారం మండలం దామెర కుంట గ్రామానికి చెందిన సుమారు 70 మంది మహిళలు బుధవారం బీజేపీ పార్టీ లో చేరారు.అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతులు అవుతున్నారు, ఒక కొత్త నాయకత్వం కొరకు ఆలోచన చేస్తున్నారు,చట్ట సభలో 33% రిజర్వేషన్ కల్పించి వారి జీవితలకు బీజేపీ పార్టీ భరోసా కల్పించిది,మంథని ప్రాంత మహిళలు డబ్బులు,ప్రలోబాలకు లొంగకుండా బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.