Thursday, September 19, 2024
Homeతెలంగాణకాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బీసీ నాయకులను బీఎస్పీలోకి ఆహ్వానించిన - బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి...

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బీసీ నాయకులను బీఎస్పీలోకి ఆహ్వానించిన – బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బీసీ నాయకులను బీఎస్పీలోకి ఆహ్వానించిన – బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష

ఓదెల, అక్టోబర్ 19(కలం శ్రీ న్యూస్):ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో నేడు 58వ రోజు మన ఊరు మన ఉష కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి బీఎస్పీ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష హాజరై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ఏనుగు గుర్తును పరిచయం చేస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీని ప్రజలకు వివరిస్తూ బీఎస్పి అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు.

అనంతరం దాసరి ఉష  మాట్లాడుతూ కొలనూరు గ్రామంలో కొన్ని కుటుంబాలు కనీస విద్యుత్ సౌకర్యం లేక, ఎక్కడో అడివిలో ఇల్లు కట్టుకొని జీవిస్తున్నట్టుగా, కొన్ని కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారని, అలాగే రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. అనంతరం నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బీసీ నాయకులు గంట రాములు యాదవ్, వేముల రామ్మూర్తి  పలువురు నాయకులు రాజీనామ చేయడం చక్కటి నిర్ణయం అని అన్నారు, ఇప్పటికైనా అగ్రవర్ణ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో బీసీలకు సముచిత న్యాయం ఆ పార్టీలు చేయలేవు అన్నారు, మరలా బిజెపి, ఏ ఇతరత్రా పార్టీలకు వెళ్లిన ఒక దొర కింద ఉండాల్సిందే అని అన్నారు. ఏదైతే ఎన్నికల ముందు ఒక బీసీ అభ్యర్థిని గెలిపించుకుందామని పలుమార్లు నిర్ణయించుకున్నామొ ఈరోజు ఒక బీసీ బిడ్డగా బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోగా వున్న నన్ను గెలిపించాల్సిన బాధ్యత బీసీ నాయకులపై ఉందన్నారు. బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కనుక బీసీ నాయకులు అందరూ బహుజన సమాజ్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గొట్టే రాజు, జిల్లా మహిళా కన్వీనర్ పూరేల్ల స్వప్న గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కాంపల్లి బాబు, పెద్దపల్లి అసెంబ్లీ అధ్యక్షులు బొంకురి దుర్గయ్య, ఉపాధ్యక్షులు నార్ల గోపాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సాతూరి అనిల్, అసెంబ్లీ కోశాధికారి ఎండి రియాజ్, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు రామిళ్ళ శారద, బీవిఎఫ్ జిల్లా కన్వీనర్ మచ్చ రాహుల్, ఓదెల మండల మాజీ అధ్యక్షులు పల్లే ప్రశాంత్, స్థానిక మండల బీఎస్పి నాయకులు సాతూరి రాజేశం, కళ్యాణ మహేష్, కాసర్ల శ్రీనివాస్, ఎండి మోయిన్, సతీష్, బివిఎఫ్ టీం, మహిళలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!