అవకాశం ఇవ్వండి….అండగా ఉంటా…
బీసీ సామాజిక వర్గం నుండి తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని బీజేపీ పార్టీ అధిష్టానాన్ని కోరిన సామాజిక కార్యకర్త ఏగోలపు సదయ్య గౌడ్
సుల్తానాబాద్, అక్టోబర్ 18(కలం శ్రీ న్యూస్):పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో నియోజకవర్గంలో చందన బౌరి, హిమాచల్ ప్రదేశ్ లో చాయ్ వాలాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిన ఘనత బీజేపీ పార్టీదని, అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో గత19 సంవత్సరాల నుండి చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి తనకు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్నీ సామాజిక కార్యకర్త ఏగోలపు సదయ్య గౌడ్ కోరారు.
2004 సంవత్సరం నుంచి పెద్దపల్లి నియోజకవర్గంలో ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు పేరుతో అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ,ఎన్నో నిరుపేద కుటుంబాలను అక్కున చేర్చుకుంటూ, ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తూ, చదువుకునే పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారికి కావాల్సిన స్టడీ మెటీరియల్ అందజేస్తూ,యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా వారికి అవసరమైన క్రీడా కిట్లు అందజేస్తూ క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ,నిరుపేద అమ్మాయిల పెళ్ళిలకు మేన మామల తన వంతు సహాయం అందజేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.గత సంవత్సరం మే 29-05-2022 న కరోన కష్ట కాలం లో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవలు అందించిన 817 మంది ఏ.ఎన్.ఎం లకు,ఆశ కార్యకర్తలను ఘనంగా సన్మానించిన ఘనత ఏగోలపు సదయ్య గౌడ్ ది.కరోన సమయంలో ప్రభుత్వ బడులు మొదలైన తర్వాత పిల్లలు ఎవరు కరోన బారిన పడవద్దనే మంచి సంకల్పంతో 15000 మంది విద్యార్థులకు 30000 మాస్కుల ఇచ్చిన ఘనత అతనిది. పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు కు పెట్టింది పేరు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సేవాభావమున్న బీజేపీ నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్ కు బీజేపీ బీసీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే గెలుపు ఖాయమని అంటున్న ప్రజలు, రాజకీయ విశ్లేషకులు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అమరగాని ప్రదీప్ కుమార్ గౌడ్,ముస్కు విజయ్, శ్రీకాంత్,వీరగొని కిరణ్ గౌడ్, కదురు రంజిత్, పెండ్లి అజేయ్,మంద అన్వేష్,ఇల్లందుల అంజి గౌడ్, గౌడ సంఘం నాయకులు బాలసాని శ్రీనివాస్ గౌడ్,తాళ్ళ తిరుపతి గౌడ్,పూరెళ్ళ శ్రీనివాస్ గౌడ్,బాలసాని సదయ్య గౌడ్,కెక్కర్ల రాజు గౌడ్,పూరేళ్ళ మణికంఠ గౌడ్ తదితరులు పాల్గొన్నారు