సీఎం సభాస్థలిని పరిశీలన చేసిన పుట్ట
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 18(కలం శ్రీ న్యూస్):అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా నవంబర్ 07న మంథనిలో నిర్వహించనున్న సీఎం కేసిఆర్ బహిరంగ సభ,సభా స్థలిని మంథని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పరిశీలించారు.బుధవారం మంథని మున్సిపల్ పరిధిలోని కొత్త పెట్రోల్‌బంక్ సమీపంలో మంథని గోదావరిఖని ప్రధాన రహదారి పక్కన బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు,సీఎం కేసీఆర్ హజరయ్యే బహిరంగ సభకు స్థలాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.బహిరంగ సభ ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన నాయకులకు సూచించారు.