ధర్మ సమాజ్ పార్టీ మంథని నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా చిట్యాల శ్రీనివాస్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 18(కలం శ్రీ న్యూస్):ధర్మసమాజ్ పార్టీ మంథని నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా చిట్యాల శ్రీనివాస్ ని రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహరాజ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రకటించారు.ఈ సందర్భంగా మంథని నియోజక వర్గ కేంద్రంలో ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చిట్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ డా.విశారదన్ మహారాజ్ కు ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి విడత లిస్టు బీసీ ఎస్సీ ఎస్టీ 53 మందిని నిర్ణయించి వారికి మొదటి విడత టికెట్లు ఖరారు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో 7 శాతం లేని అగ్రకుల కాంగ్రెస్,బిఆర్ఎస్,బిజెపి,ఇతర పార్టీల దుష్ట వైఖరి కుటీల రాజకీయాలను మోసపూరిత హామీలను ప్రజాక్షేత్రం ఈ ఎన్నికల్లో ఎండగడతామని,93 శాతం ఉన్న బీసీ, ఎస్సీ,ఎస్టీల తరఫున ఉన్న ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని,మంథని నియోజకవర్గంలో సబ్బండ కులాలు మద్దతుగా నిలవాలని కోరారు.