భావితరాల కోసం యువత ఆలోచన చేయాలే
మంథని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 18(కలం శ్రీ న్యూస్):మంథని నియోజకవర్గంలో వాస్తవ విషయాలపై యువత చర్చించాల్సిన అవసరం ఉందని మంథని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్మన్ ఫుట్ట మధూకర్ అన్నారు.బుధవారం మంథని పట్టణంలోని రాజగృహాలో ముత్తారం మండలం ఖమ్మంపల్లి ఎస్సీ కాలనీకి చెందిన సుమారు వంద మంది యువకులు బీఆర్‌ఎస్‌లో చేరగా ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతానికి ప్రస్తుతానికి బేరీజు వేసుకుని వాస్తవాలను గ్రహించాలన్నారు. మభ్యపెట్టేవాళ్లు ఎవరో మంచి చేసే వాళ్లు ఎవరో ఆలోచన చేసి ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత యువత తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామానికి అభివృధ్దిబాటలు పడాలంటే స్థానిక యువకులు మంచి నాయకత్వానికి మద్దతు తెలుపాలన్నారు.అనేక ఏండ్ల క్రితం మహనీయులు మన గురించి మన బావితరాల గురించి ఆలోచన చేసి జీవితాలు త్యాగం చేసిన విషయాలను,మహనీయుల చరిత్రను తెలుసుకుని వారిస్పూర్తిని చాటి చెప్పాలన్నారు.బావితరాల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత యువతరం పై ఉందని,ఆ దిశగా ఆలోచన చేస్తూ ముందుకు అడుగుల వేయాలని పిలుపునిచ్చారు.