భవిష్యత్ బాగు కోసం పనిచేయాలే
బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 17 (కలం శ్రీ న్యూస్):భవిష్యత్ బాగు కోసమే యువత పని చేయాలని బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.మంథని నియోజకవర్గంలోని మహాముత్తారం,మల్హర్,కాటారం మండలాలకు చెందిన సుమారు 150 మంది మున్నా సైన్యం యువకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం మంథనిలో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలోచేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందని, ఈ క్రమంలొ గొప్పగా ఆలోచన చేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రేపటి తరాలకు మార్గదర్శకులుగా నిలిచే యువత నేటి సమాజంలోని వాస్తవ విషయాలపై చర్చించి ప్రజలకు అవగహన కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని, బీఆర్‌ఎస్ పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.