బీఆర్‌ఎస్‌లో చేరిన ధన్వాడ మాజీ సర్పంచ్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 16 (కలం శ్రీ న్యూస్):కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సొంత ఇలాఖా నుంచి వలసల పర్వం మొదలైంది.కాటారం మండలంలోని శ్రీధర్‌బాబు స్వగ్రామమైన ధన్వాడ మాజీ సర్పంచ్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోబర్ల వెంకటరమణ కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు.సోమవారం మంథని పట్టణంలోని రాజగృహాలో మంథని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.గత 30ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వెంకటరమణ గ్రామసర్పంచ్‌గా పనిచేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్‌బాబుకు అత్యంత సన్నిహితులుగా ఉండే వెంకటరమణ కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.