Saturday, July 27, 2024
Homeతెలంగాణపదవుల అనుభవించి పార్టీ మారడం సమంజసమేనా 

పదవుల అనుభవించి పార్టీ మారడం సమంజసమేనా 

పదవుల అనుభవించి పార్టీ మారడం సమంజసమేనా 

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని అక్టోబర్ 16 (కలం శ్రీ న్యూస్): జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ చొరవతో పదవులు అనుభవించి పార్టీలు మారడం ఎంతవరకు సమంజసం అని మండల యువజన విభాగం అధ్యక్షుడు కొండ రవీందర్ తీవ్రస్థాయిలో పార్టీలు మారిన వారి పైన మండిపడ్డారు. సోమవారం మంథని పట్టణం ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల యువజన విభాగం అధ్యక్షుడు కొండ రవీందర్, మండల అధికార ప్రతినిధి మంథని లక్ష్మణ్ లు మాట్లాడుతూ సర్పంచ్ గా గెలవలేని కొండ శంకర్ ను ఎంపీపీగా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఎన్నుకుంటే, పుట్ట మధుకర్ కి వెన్నుపోటు పొడిచి, లక్షల రూపాయలకు అమ్ముడుపోయిన ఘనత వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని, ఆదివారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో బీఆర్ఎస్ ఎంపీపీ, ఎంపీటీసీలు,సర్పంచ్,పలువురు కాంగ్రెసులో చేరడాన్ని వారు తీవ్రంగా విమర్శించారు.గతంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అండగా ప్రజలు ఉన్నారని, ఇప్పుడు కూడా ఆయనకు అండగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అమ్ముడుపోయిన వారికి బీఆర్ఎస్ లో చోటు లేదని వారు ఎద్దేవా చేశారు. పదవులు అనుభవించి,విమర్శించడం వారి విజ్ఞతకే చెల్లుతుందని,గతంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ దగ్గరకు తీయకుంటే వారి రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలందరికీ తెలుసునని, ప్రజలంతా అన్ని గమనిస్తున్నారని, త్వరలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ వచ్చే ఎన్నికల్లో ప్రజల అండతో గెలవడం నిశ్చయమైందని,పుట్ట మధుకర్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు కొనుగోలు ప్రక్రియ షురూ చేసిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ వేల్పుల గట్టయ్య, టిఆర్ఎస్ యూత్ నాయకులు పోట్ల శ్రీకాంత్,బడికల సది, కాసిపేట ప్రనీత్,కాసిపేట సాంబయ్య,బర్ల సుధాకర్, కారంగుల సురేష్,మంత్రి వెంకటేష్ ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!