పుట్ట మధూకర్ కు బీ-ఫామ్ అందించిన సీఎం కేసీఆర్
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 16(కలం శ్రీ న్యూస్):బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు,సీఎం కేసీఆర్ మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ కు బీ- ఫామ్ అందజేశారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంథని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పుట్ట మధూకర్ కు ఆయన బీ-ఫామ్ అందజేశారు. గత నెలలో మంథని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్ట మధూకర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బీ-ఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ తనపై నమ్మంకం తో మూడోసారి పార్టీ భీ-ఫామ్ అందించిన సీఎం కేసిఆర్ కి మరియు సహకరించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.