Wednesday, May 29, 2024
Homeతెలంగాణజడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ కే బహుజనుల మద్దతు 

జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ కే బహుజనుల మద్దతు 

జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ కే బహుజనుల మద్దతు 

మంథని,రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని అక్టోబర్ 15 (కలం శ్రీ న్యూస్) : రాబోయే ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ కు బడుగు, బలహీన వర్గాల వారు మద్దతు తెలుపడం జరిగిందని తెలిపారు. ఆదివారం మంథని పట్టణంలో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపు సంఘం నాయకులు,ఇతర బడుగు బలహీన వర్గాల నాయకులు అంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ కు గెలిపించుకోవాలని వారు ముక్త కంఠంతో వివరించారు. మున్నూరు కాపు సంఘం నాయకులతో పాటు ఇతర బలహీన వర్గాల నాయకులు రాష్ట్రం అంతా మున్నూరు కాపు నాయకులకు మద్దతు తెలిపాలని, బడుగు బలహీన వర్గాల సమస్యలు అసెంబ్లీలో వినిపించాలంటే, బడుగు బలహీన వర్గాల సంఘాల తరఫున నాయకులను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే సాధ్యమవుతుందని,అందుకే మంథని నుండి మొదటగా బడుగు బలహీన వర్గాల నాయకుడైన పుట్ట మధుకర్ కు మద్దతు తెల్పడం జరుగుతుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ పటేల్ మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర ఫోరం అధ్యక్షుడు ఎడ్ల రవి పటేల్,మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్ అన్ని సంఘాల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోపాల సుమన్, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు మల్క రామస్వామి,కొత్త శ్రీనివాస్, ఆకుల కిరణ్, శ్రీపతి బానయ్య, పుట్ట ముకేష్,క్రాంతి,సురేష్, ప్రణీత్, బండారి అనిల్,రాజ్ కుమార్,చందు,తోటరాజు,బొడ్డు శేఖర్,సాగర్ల రాజు,పెరుక చందు, ఇమ్మడి మోహన్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!