బీఆర్ఎస్ లో చేరిన విజ్జగిరి సంజీవ్.
ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గెలుపే లక్ష్యం..
సుల్తానాబాద్, అక్టోబర్ 15(కలం శ్రీ న్యూస్): సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని 5వ వార్డుకు చెందిన విజ్జగిరి సంజీవ్ ఆదివారం బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి, మాజీ సర్పంచ్ డాక్టర్ ఐల రమేష్ ఆధ్వర్యంలో విజ్జగిరి సంజీవ్ తో పాటు హనుమాన్ నగర్ యూత్ సభ్యులు తొర్రికొండ రాజు, కోయల్ కార్ నాగరాజు, తొర్రికొండ రాకేష్ పలువురు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం లబ్ధి చేకూరేలా చేసిందని అన్నారు. అనంతరం ఐల రమేష్ మాట్లాడుతూ బిఆర్ఎస్ లో చేరిన వారికి తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. అనంతరం విజ్జగిరి సంజీవ్ మాట్లాడుతూ పెద్దపెల్లి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డిని గెలిపించడానికే బిఆర్ఎస్ లో చేరానని పేర్కొన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయితేనే సుపరిపాలన జరుగుతుందన్నారు. కుల, మత బేధాలు లేకుండాఅన్ని వర్గాలను ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నొక్కి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లాలపల్లికి చెందిన బీఆర్ఎస్ లీడర్ గుర్రం మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.