బీఆర్ఎస్ కు భారీ షాక్..
భారాస పార్టీ నుండి వీడి కాంగ్రెస్ పార్టీ లోకి చేరుతున్న నాయకులు
సుల్తానాబాద్, అక్టోబర్ 15(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ కు చెందిన భారస ముఖ్య నాయకులు కేడీసీసీ జిల్లా బ్యాంక్ డైరెక్టర్, సుల్తానాబాద్ పాక్స్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సుల్తానాబాద్ పాక్స్ సింగిల్ విండో డైరెక్టర్లు కూకట్ల ఓదెలు యాదవ్,మేకల రాజయ్యయాదవ్,బండ గోపాల్ యాదవ్, పోతర్ల కమలమ్మ -రాజయ్య లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మారవేణి లచ్చయ్య యాదవ్, పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.