బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు..
సుల్తానాబాద్, అక్టోబర్ 15(కలం శ్రీ న్యూస్): సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామానికి చెందిన జనగామ శ్రీధర్ రావు (వార్డు సభ్యులు), బండి ఉదయ్ కిరణ్ (వార్డు సభ్యులు), అసరి సంపత్ (వార్డు సభ్యులు), బెజ్జెంకి కనకయ్య (వార్డు సభ్యులు), జూపెల్లి శ్రీనివాస్ రావు, జూపెల్లి తిరుమల రావు, ఆసరి రవీందర్ యాదవ్, లింగంపెల్లి కోమురయ్య, జూపేల్లి శ్రీధర్ రావు, ఆసరీ శ్రీనివాస్ రావు, ఆసరి హరీష్ రావు లు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపదంలోకి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.