నేటి నుంచి శ్రీ మహాలక్ష్మీ అలయంలో శరన్నవరాత్రోత్సవాలు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని,అక్టోబర్ 14(కలం శ్రీ న్యూస్):దసరా పండగను పురస్కరించుకొని స్థానిక శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ఆదివారం నుంచి దేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమై ఆక్టోబర్ 22 తేదీ వరకు కొనసాగనున్నాయి.ఈ మేరకు ఆలయాన్ని ఉత్సవాల కోసం ముస్తాబు చేశారు. ఆదివారం ఉదయం అంఖడ దీపారాధనతో ఉత్సవాలు ప్రారంభం కావడంతో పాటు అక్టోబర్ 21న చక్రి భజన, 22న అమ్మవారికి ప్రత్యేక భజన,పవళింపు సేవ,ఆశీర్వచన కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించనున్నారు. నవరాత్రుల్లో 9రోజుల నిరంతరాయంగా భజన కార్యక్రమం కొనసాగడం ఎన్నో ఏళ్లుగా ఈ ఆలయ ప్రత్యేకతగా ఉంది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మ వారిని దర్శించుకొని ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ మారుపాక చంద్రకళ-రమేష్, డైరెక్టర్లు పోతరాజు వెంకటలక్ష్మి, బత్తుల విజయలక్ష్మి,నీలం రమేష్, కాయితోజు సమ్మయ్య,బడికెల శ్రీనివాస్, కొత్త బాలయ్య, ఎండోమెంట్ ఈవో రాజ్ కుమార్ లు కోరారు.