ఎన్నికల బాధ్యతలను సమర్దవంతంగా నిర్వర్తించాలి
– ఆర్డిఓ హనుమ నాయక్
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 13 ( కలం శ్రీ న్యూస్): శుక్రవారం 24-మంథని అసెంబ్లీ నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి హనుమ నాయక్ నియోజక వర్గ స్థాయి నోడల్ అధికారులను నియమించి వాళ్ళకు కేటాయించబడిన బాధ్యతల గురించి ఈ సమావేశంలో తగు సూచనలు చేసినారు.ఎన్నికలు సజావుగా జరిగేందుకు రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులు,జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు మరియు నియోజకవర్గ స్థాయి ఎన్నికల అధికారి జారీ చేసిన ఆదేశాల నిర్దేశించిన సమయములో తప్పకుండా పాటిస్తూ,రోజూవారి నివేదికలు సమర్పించవలసినదిగా ఆదేశించినారు. ఈ సమావేశములో డిఏఓ తూము రవీందర్,తహశీల్దార్లు రాజయ్య, మోహన్ రెడ్డి, రాంచందర్ రావు, శ్రీనివాస్,శ్రీనివాసులు,నాగరాజు, హేమ,లక్ష్మిరాజయ్య, నాయబ్ తహశీల్దార్లు సంతోష్ సింగ్, ఉదయ్ కుమార్,కోటేశ్వర్ రావు, రాకేశ్,సందీప్,మంథని మున్సిపల్ కమిషనర్ సతీష్,సిడిపిఓ రాధిక, సూపర్ వైజర్ రజిత,డిఎల్పిఓ రాం బాబు,మంథని ఫైర్ ఆఫీసర్ సదానందం నేత,మండల సర్వేయర్లు అనిల్,లలిత కుమారి, పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.