Sunday, December 3, 2023
Homeతెలంగాణబీజేపీ లో భారీ చేరికలు 

బీజేపీ లో భారీ చేరికలు 

బీజేపీ లో భారీ చేరికలు 

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని అక్టోబర్ 13 (కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథని బీజేపీ పార్టీ ఆఫీస్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు.శుక్రవారం మహాదేవ్ పూర్ మండలం కన్నెపల్లి, రామగిరి మండలం సింగిరెడ్డి పల్లి,మల్హర్ రావ్ మండలం రావుల పల్లి,కాటారం మండలం దామరా కుంట, మంథని మండలం మల్లారం గ్రామాలకు చెందిన సుమారు 300 మంది మహిళలు,యువత బీజేపీ పార్టీ లో చేరారు. వీరికి సునీల్ రెడ్డి కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు.అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ రోజు రోజు కు బీజేపీ పార్టీ మరింత బలపడుతుందని,కాంగ్రెస్,బీఆరఎ స్ పార్టీలకు మంథని ప్రాంతంలో మనుగడ లేదని,ఒక కొత్త నాయకుడిని,బిజెపి పార్టీని, ప్రజలు కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ చేరికలే నిదర్శనం అని 40 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన,పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసి ప్రజలు విసుగు చెందారని,అవినీతి అక్రమాలు,అసమర్ధ పాలనకు మంథని ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈసారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని,మంథని అభివృద్ధిని కోరుకుందాం అని అవినీతి అక్రమ ఆస్తులు సంపాదించుకొని మళ్లీ ఓటర్లను మభ్యపెట్టి మద్యం డబ్బుతో ప్రజలను కొనాలని ఇద్దరు నాయకులు చూస్తున్నారని మీ ఓటుతో ఈసారి బుద్ధి చెప్పాలని ఒకసారి మంతినిలో బిజెపికి అవకాశం ఇవ్వాలని నరేంద్ర మోడీ సంక్షేమ పాలనను అవినీతి రహిత పాలన మంథనిలో తీసుకువద్దామని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!