Wednesday, May 22, 2024
Homeతెలంగాణబలహీన వర్గాలకు అండ కాంగ్రెస్ పార్టీ జెండా

బలహీన వర్గాలకు అండ కాంగ్రెస్ పార్టీ జెండా

బలహీన వర్గాలకు అండ కాంగ్రెస్ పార్టీ జెండా

కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్

మంథని అక్టోబర్ 13 (కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ మంథని మండల అధ్యక్షులు ఆయిలీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో హాజరైన కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండా కాంగ్రెస్ పార్టీ జెండా మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప బలహీన వర్గాలు బాగుపడే పరిస్థితి లేదని 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం చూసి చలించిన సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కల్లబొల్లి మాటలతో సెంటిమెంటుతో అనేక అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ నైజాం సర్కార్ను తలపించే విధంగా ఒక నియంతలాగా పరిపాలించడమే కాకుండా బంగారు తెలంగాణ చేస్తా అని బడాబడా మాటలు చెప్పి పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించి మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని మరొకసారి పిట్టలదొరలాగా దళిత బంధు బీసీ బందు మైనార్టీ బందు గృహలక్ష్మి లాంటి పథకాల పేరుతో ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి ముందుకు వస్తున్న తరుణంలో ఈ సందర్భంగా సూటిగా కెసిఆర్ ని ప్రశ్నిస్తున్నాం ఈ పది సంవత్సరాల కాలంలో ప్రగతి భవన్ కట్టుకున్న మీరు ఏ ఒక్క పేదోడికి కూడా డబల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు నిరుద్యోగులు ముఖ్యంగా బహుజన విద్యార్థులు రాష్ట్ర రాజధానిలో కడుపు మార్చుకొని ఉన్న ఆస్తులు అమ్ముకొని నోటిఫికేషన్లు వస్తాయేమో అని గంపడంత ఆశతో చదువుకుంటున్న ఇప్పటివరకు ఒక్క పరీక్ష కూడా సరిగా నిర్వహించకుండా మోసం చేస్తున్న తీరును మీరు ప్రజలకు చేసిన నష్టాన్ని కాలేశ్వరం ప్రాజెక్టుతో మీరు దోచుకున్న దోపిడి సొమ్మును ప్రజల ఆస్తులను అమ్ముతున్న తీరును ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు సవివరంగా తెలియజేసి ప్రజలను చైతన్య పరిచి మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తనే ఇంటింటికి రక్షా అని అందుకోసమే ఈ ప్రాంతంలో మంథని నియోజకవర్గంలో ఎంతోమంది బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ ఎంతోమంది బహుజన నాయకులను తయారు చేసిన మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు ఏఐసిసి కార్యదర్శి దుద్ధీల శ్రీధర్ బాబు ని తిరిగి మంథని నియోజకవర్గంలో శాసన సభ్యుడిగా గెలిపించుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని సాధించుకొని ప్రతి ఇంటికి 6 గ్యారంటీలను వివరించి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి బహుమతిగా అందించే వరకు ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బద్ధులై పని చేస్తామని అన్నారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార కిషన్ జీ మాట్లాడుతూ బహుజనులను కులవృత్తుల పేరుతో మోసం చేసి ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇవ్వని ఈ కేసిఆర్ కు క్షేత్రస్థాయిలో బుద్ధి చెప్పే విధంగా మంథని నియోజకవర్గం లో శ్రీధర్ బాబు ని గెలిపించుకొని రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వచ్చేవరకు ప్రతి ఒక్క బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తో పాటు మంథని మండల బీసీ సెల్ అధ్యక్షులు ఐలి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జి,జిల్లా నాయకులు మాచిడి రవితేజ గౌడ్, ముత్తారం మండల అధ్యక్షులు అల్లం కుమారస్వామి,రామగిరి మండల అధ్యక్షులు బండారి సదానందం,బీసీ సెల్ నాయకులు బండారి ప్రసాద్,జిల్లా కార్యదర్శి గట్టు విజయ్,బీసీ సెల్ నాయకులు నాగుల రాజయ్య, ఊరకొండ గణేష్,గడ్డం రాజా గౌడ్, కోరబోయిన కృష్ణవంశీ,తాళ్లపల్లి సత్యనారాయణ,ఎండి సాహిబ్, గుంజపడుగు అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!