Saturday, July 27, 2024
Homeతెలంగాణబిక్షేశ్వరాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం

బిక్షేశ్వరాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం

బిక్షేశ్వరాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం

యువ వేద పండితులచే జరిగిన కార్యక్రమం

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని అక్టోబర్ 13 (కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలోని శ్రీ బిక్షేశ్వర స్వామి దేవాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం కార్యక్రమం యువ వేద పండితులు ఘనంగా నిర్వహించారు. శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన మంథని పట్టణంలో ఐదు ప్రధాన శివాలయాలు ఉన్నాయి. వాటిలో శ్రీ ఓంకారేశ్వర్ ఆలయం, శ్రీ భిక్షేశ్వర ఆలయం, శ్రీ గౌతమేశ్వరాలయం, శ్రీ శీలే శ్వర-సిద్దేశ్వర ఆలయాలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. ప్రతినెల అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి పురస్కరించుకొని గురువారం రాత్రి శ్రీ బిక్షేశ్వర స్వామి దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దక్షిణ భారతదేశంలో గల పశ్చిమ ముఖ ద్వారం కలిగిన ఏకైక శివాలయం గా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ప్రదోషకాలంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వేద పండుగలు తెలిపారు. పంచభూతాలు మానవులను సుభిక్షంగా ఉంచాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. కార్యక్రమం అనంతరం ఉపవాస దీక్షను విరమించి సహపంక్తి భోజనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఓజ్జల గణేష్ శర్మ, నల్లగొండ వెంకన్న శర్మ, శ్రీరాంభట్ల ఆదిత్య శర్మ, రంగి రాజన్న శర్మ, పల్లి సంజీవ్ శర్మ, మహావాది విజయకుమార్ శర్మ, తనువుల శ్రీవత్సవ శర్మ,మహావాది శివకుమార్ శర్మ, డింగిరి హరి శర్మ, దహగం త్రయంబక్ శర్మ, నచ్చ గారి సృజన్ శర్మ, యజ్ఞం పట్ల శ్రీకాంత్ శర్మ, డింగిరి అభిరాం శర్మ, రామ్ చరణ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!