Wednesday, May 22, 2024
Homeతెలంగాణఅభివృద్ధి ప్రదాత...దాసరి మనోహర్ రెడ్డి ని గెలిపించండి

అభివృద్ధి ప్రదాత…దాసరి మనోహర్ రెడ్డి ని గెలిపించండి

అభివృద్ధి ప్రదాత…దాసరి మనోహర్ రెడ్డి ని గెలిపించండి

ఎమ్మెల్యే తనయుడు, బీఆర్ఎస్ యువనాయకులు దాసరి ప్రశాంత్ రెడ్డి 

కాల్వ శ్రీరాంపూర్,అక్టోబర్12(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ని మరోసారి గెలిపించాలని ఎమ్మెల్యే తనయుడు,  బీఆర్ఎస్ యువనాయకులు దాసరి ప్రశాంత్ రెడ్డి కోరారు. గురువారం కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించి బీఆర్ఎస్ పార్టీనీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే దాసరి మనోహర్ రెడ్డి ని మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని గుర్తించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి దాసరి మనోహర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి ,ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడుగు రాజకొమురయ్య యాదవ్, ఎంపీటీసీ సుంకం నిర్మల-మల్లారెడ్డి, రైతు సమన్యయ సమితి మండలాధ్యక్షుడు నిదానపురం దేవయ్య, యూత్ మండలాధ్యక్షుడు నూనేటి కుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు కూకట్ల నవీన్, రైతు సమన్వయ సమితి గ్రామ శాఖ అధ్యక్షుడు జంగ రమణారెడ్డి, గౌడ సంఘం అధ్యక్షులు ఈరగోని సదయ్య, నాయకులు వీరగోని సదయ్య, పత్తి భాస్కర్ రెడ్డి, క్రిష్ణా రెడ్డి, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు యువకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!