యువత చేతిలోనే దేశ భవిష్యత్తు
బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 12 (కలం శ్రీ న్యూస్): దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని,ఆ దిశగా యువత అడుగులు ముందుకు వేయాలని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.మహాముత్తారం మండలానికి చెందిన సుమారు 30మంది యూత్ సభ్యులు గురువారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంథని పట్టణంలోని రాజగృహాలో యూత్ సభ్యులకు ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేసే ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ పార్టీ అని,సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేయడం అదృష్టంగా బావించాలని అన్నారు. నేటి యువత గొప్పగా ఆలోచన చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. 40ఏండ్లలో జరుగని అభివృధ్దిని నాలుగేండ్లలో చేసి చూపించామని, ఇలాంటి వాస్తవ విషయాలను తెలుసుకుని ప్రజల్లో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్‌పార్టీలో యువతకు మంచి ప్రాధాన్యత ఉంటుందని,అలాగే బీఆర్‌ఎస్ సర్కార్‌లో యువత అభ్యున్నతికి పెద్దపీట వేయడం జరుగుతుందని ఆయన వివరించారు.బీఆర్‌ఎస్ పార్టీ గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని,రాష్ట్రంలో, మంథనిలో గులాబీ జెండా ఎగురవేయడంలో యువత కీలకపాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.పార్టీలో చేరిన వారిలో మహా ముత్తారం యూత్ సభ్యులు పంగ సురేష్,పంగ దేవేందర్, కొయ్యాల మహేందర్, మంథెన లవకుమార్, మంథెన రాజబాపు,రామిల్ల వంశీ, ఆసంపెల్లి లచ్చయ్య, కొండ మల్లయ్య, మారపాక పోచయ్య, గంధం రాజబాపుతో పాటు పలువురు ఉన్నారు.