Saturday, July 27, 2024
Homeతెలంగాణగర్రెపల్లి మోడల్ స్కూల్ లో బతుకమ్మ వేడుకలు-

గర్రెపల్లి మోడల్ స్కూల్ లో బతుకమ్మ వేడుకలు-

గర్రెపల్లి మోడల్ స్కూల్ లో బతుకమ్మ వేడుకలు-

సుల్తానాబాద్, అక్టోబర్ 12(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లో గర్రెపల్లి మోడల్ స్కూల్ లో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రఘునాథ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే వివిధ రకాల పూలతో జరుపుకునే ఏకైక పూల పండుగ,మన తెలంగాణలోనే మహిళలు జరుపుకుంటారు. మన రాష్ట్ర పండుగైన బతుకమ్మ వేడుకలలో భాగంగా తెలంగాణ యాసలో పాటలు పాడుతూ తల్లి కూతుళ్ళ అన్నాచెల్లెళ్ల అనురాగాల గూర్చి మరియు ఉమ్మడి కుటుంబంలో కష్టసుఖాల గురించి మహిళలు తమ పాటల ద్వారా వెల్లడి చేస్తారు.స్త్రీ కి కుటుంబం అంతా తన కళ్ళముందే బ్రతకడం ఆమె జీవితానికి ఒక వరం వంటిది అందుకే తన వాళ్ళందరికీ చల్లటి బతుకును ప్రసాదించుమని గౌరి దేవిని బతకమ్మగా పూజిస్తుంది.ప్రకృతి నుండి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికే సమర్పించుకోవడం బతుకమ్మను నీటిలో విడిచిపెట్టడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేని సంస్కృతి మనది అన్నారు.

ఈ కార్యక్రమంలో మహిళా అధ్యాపక ఉపాధ్యాయులు కె.జ్యోతి, ఫర్హీన్ అప్సర్,రజిత, అనురాధ,సుధా, హరిప్రియ, సంధ్య, జ్యోతి కుమారి, వెంకటలక్ష్మిలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!