Thursday, April 18, 2024
Homeతెలంగాణబి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు.

బి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు.

బి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు.

పెద్దపల్లి,అక్టోబర్12(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి మండలంలోని సబ్బితం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు.పెద్దపల్లి మండలం, సబ్బితం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గాజుల సతీష్ (వార్డు సభ్యులు), ఉప్పరి రవీందర్, వాసు, సుంచు సారయ్య, కనుకుంట్ల అనిల్, ఆకుల రాము, ఆకుల అజయ్,గుర్రాల సందీప్, ఆకుల శంకర్, అంకం రాజు, గాజుల రామ స్వామి, మాజీ వార్డు సభ్యులు ,సుంచు తిరుపతి, భూతగడ్డ కుమార్, గాజుల అశోక్, అనిల్, ప్రశాంత్, శ్రీనివాస్, మేడిపల్లి సంపత్, కాల్వల శంకర్, కల్లేపెల్లి అజయ్, గాజుల గట్టయ్య, పులిపాక దేవ దానము, నూనె అంజయ్య, చేగొండ కొమురయ్య, గుర్రాల శంకర్, జంగపెల్లి కనుకయ్య, యాదగిరి కొమురయ్య, రేకుల భుచ్చయ్య, గంధం రాములు, నీలి మల్లయ్య, మాదసు రాములు, చిగురు మొండయ్య, దేవరకొండ శ్రీనివాస్, మెరుగు వెంకటేశం, పడాల వినయ్, మిరియాల శ్రీనివాస్, అరుకుటి శ్రీనివాస్, ఈరవెని రాకేష్, శ్రీరాముల వెంకన్న, ఆకుల సతీష్, సుంచూ రమేష్, పల్లెర నరేష్, వీర చారి, నంసాని రాజేష్, సంచు భీమరాజు, గుర్రాల మల్లేష్, చేగొంద కొమురయ్య, నీలి కనుకయ్య, చినోజు వెంకన్న గార్లు తదితరులు విజయరమణ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించి, పెద్దపల్లి నియోజకవర్గంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ సందర్భంగా విజయరమణ రావు గారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ అవలంబిస్తున్న దుర్మార్గపు, నిరంకుశ పాలనను పెద్దపల్లి నియోజకవర్గంలో స్ధానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నియంత పాలనకు చరమగీతం పాడేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా సిద్దమైంది. ఈ రోజు పెద్దపల్లి మండలంలోని సబ్బితం గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీకీ చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ నా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరం అని, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పెద్దపల్లి ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ బొంద పెడతారని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!