ఓటరులారా ఏలాంటి ప్రలోభాలకు లొంగకండి –
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష
కాల్వ శ్రీరాంపూర్,అక్టోబర్12(కలం శ్రీ న్యూస్):కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో 53వ రోజు మన ఊరు మన ఉష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఎస్పీ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష హాజరై ఇంటింటికి ఏనుగు గుర్తును పరిచయం చేస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీని ప్రజలకు వివరిస్తూ బీఎస్పి అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు అనంతరం దాసరి ఉష మాట్లాడుతూ ఈ 48 రోజులలో మద్యం ఏరులై పారుతుందని, డబ్బుతో విచ్చలవిడిగా ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తారని వాటన్నింటికీ దూరంగా ఉండి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కేవలం బహుజన రాజ్యమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ కాల్వ శ్రీరాంపూర్ మండల అధ్యక్షులు కుమ్మరికుంట రవి కుమార్ మండల ఉపాధ్యక్షులు కొర్రె కిరణ్, మండల కోశాధికారి రాము, కాల్వ శ్రీరాంపూర్ గ్రామ మహిళా కన్వీనర్ కుమ్మరి కుంట శారద, మెర్గవేన సంపత్, స్థానిక గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు