టిఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇంచార్జి గా కన్నూరి బాపు
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 11( కలం శ్రీ న్యూస్): తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నియోజకవర్గ ఇన్చార్జిగా కన్నూరి బాబు ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు పెరుక నవీన్ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం మంథనిలో జరిగిన ప్రత్యేక సమావేశంలో కన్నురి బాపును ఏకగ్రీవంగా ఎన్నుకొని నియమించారు.ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కోండ్ర శంకర్ మాదిగ, మంథని మండల అధ్యక్షుడు కొయ్యల మొండి, నాయకులు అక్కపాక సది, అడ్డూరి సమ్మయ్య, అడ్డూరి శంకర్, కొయ్యల వినయ్ కుమార్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.