బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ గా ఆరెపల్లి రాకేష్
సుల్తానాబాద్ అక్టోబర్11(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణం సుభాష్ నగర్ కు చెందిన ఆరేపల్లి రాకేష్ ను భారత రాష్ట్ర సమితి ఎస్సీ సెల్ పెద్దపల్లి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గా నియమించడం జరిగింది, అనంతరం నూతనంగా నియామకమైన ఆరేపల్లి రాకేష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు పదవి బాధ్యతలు స్వీకరించిన ఎల్లవేళలా టిఆర్ఎస్ పార్టీకి కృషి చేస్తానని అన్నారు,నా నియమాకానికి సహకరించిన పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కి రుణపడి ఉంటాను తెలిపారు. ఈ నా నియామకానికి సహకరించిన ఎంపీపీ బాలాజీ రావు, మండల పార్టీ అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్ ల కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఆరెపల్లి రాకేష్ నియామకం పట్ల మండలంలోని పలువులు హర్షం వ్యక్తం చేశారు..