మాదిగల యుద్ధభేరిని విజయవంతం చేయండి
టిఎస్ ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్ మాదిగ
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 11 (కలం శ్రీ న్యూస్ ): హైదరాబాదులో ఈనెల 23న జరిగే మాదిగల యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కొండ్ర శంకర్ మాదిగ పేర్కొన్నారు.బుధవారం మంథని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే శాసనసభ ఎన్నికల్లో మాదిగలకు 25% శాసనసభ సీట్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వుడు శాసనసభ స్థానాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు 13 స్థానాలను ఇవ్వాలని ఆయన కోరారు.ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఆయన అన్నారు. పది సంవత్సరాల కాలంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులపై ప్రభుత్వం చేత పత్రం విడుదల చేయాలని అన్నారు.రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వారు విన్నవించారు. తెలంగాణ ప్రభుత్వ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న అధ్యాపక ఇతర బోధన ఉద్యోగాలను భర్తీ చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు పేరుకు నవీన్ మాదిగ, ఎమ్మార్పీఎస్ టీఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ కన్నూరి బాబు, ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షుడు కొయ్యల మొండి, నాయకులు అక్కపాక సది అడ్లూరి శంకర్,కొయ్యల నవీన్ కుమార్ లు పాల్గొన్నారు