Friday, December 27, 2024
Homeతెలంగాణబీఎస్పీలో భారీ చేరికలు -

బీఎస్పీలో భారీ చేరికలు –

బీఎస్పీలో భారీ చేరికలు –

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష

సుల్తానాబాద్, అక్టోబర్ 11(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ పట్టణం బీఎస్పీ పార్టీ కార్యాలయం నందు సుల్తానాబాద్ మండల నుండి కదంబపూర్, ఐత్రాజ్ పల్లి, మంచిరామీ గ్రామాల నుండి దాదాపు పెద్ద ఎత్తున జాతరకొండ పోచలు ప్రస్తుత వార్డ్ మెంబర్, న్యాతరి లక్ష్మయ్య, దండవెని లచ్చయ్య, రాజయ్య, సద్దయ్య , జోడికట్టు సుధాకర్, సతాని రాజమల్లు, వేల్పుల రామచంద్రం, తిప్పారపు అంజి, పలువురు వార్డ్ మెంబర్లు, కుల సంఘ నాయకులు, యువకులు, మహిళలు  పెద్ద ఎత్తున దాసరి ఉష  సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది అనంతరం దాసరి ఉష  మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం లో బూతు స్థాయి నుండి బలపడిందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని,పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు కంకణబద్ధులుగా బీఎస్పి గెలుపు దిశగా ప్రతి ఒక్కరికి కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్, అసెంబ్లీ కోశాధికారి ఎండి రియాజ్, సుల్తానాబాద్ మండల కోశాధికారి అల్లెపు చంద్రశేకర్, సుల్తానాబాద్ పట్టణం అధ్యక్షులు తోట మదు, రోహిత్, అనిల్, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!