ఎస్సీల అభివృద్ధికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీనే
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 11( కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందని జిల్లా ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు న్యాతరి శ్యాంసుందర్,డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యంలు పేర్కొన్నారు. బుధవారం మంథని ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ తానే ముఖ్యమంత్రి అయ్యాడని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని హామీని నెరవేర్చలేదని, గ్రామాల్లోని ఉన్న అన్ని కులాలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని దాన్ని కూడా నెరవేర్చలేదని, దళిత బంధుతో దళితులను మోసం చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని, దళిత బందు స్కీము హుజరాబాద్ నియోజకవర్గం లోనే ఇవ్వడం జరిగిందని, ఇతర నియోజకవర్గాలలో ఎక్కడ కూడా పూర్తిగా అమలు చేయలేదని, దళిత బంధు ఆశ చూపి దళితుల ఓట్ల కోసం దళితులను మభ్యపెడుతున్నాడని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో దళితుల పోరాటం మరువలేనిదని, దళితుల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. సమాజిక పరివర్తన కలిగిన సంఘాలను టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యల మీద పోరాటం చేస్తే ఆక్రమ అరెస్టులు చేస్తూ, ఇతర పార్టీల వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా దరఖాస్తు చేసుకున్న అందరికీ ఇందిరమ్మా ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ హామీలను నెరవేరుస్తామని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉన్నా రాష్ట్రాలలో 5 హామీలను నెరవేరుస్తున్నా మని, తెలంగాణలో మాత్రం ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామని, వీటితోపాటు ఎస్సీలకు 15 శాతం ఉన్న రిజర్వేషన్లను 18 శాతంకు పెంచుతామని తెలిపారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా అమలు అవుతాయన్నారు. మంథని నియోజకవర్గం దుద్దిల్ల శ్రీధర్ బాబును ఎమ్మెల్యేగా గెలిపించడానికి అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంతిని రాకేష్ ,కుక్క రవీందర్ ,మంతిని సమ్మయ్య ,నాగ పెళ్లి జాన్,కొటరి బాపు, జనగామ సడవలి,కాసిపేట బాబు, మంతిని లింగయ్య, అడ్డూరి సమ్మయ్య ,కొయ్యల సతీష్, ఎరుకల మోహన్ ,ఆర్ల నారాయణ,ఆక్కపాక సదానందం, ఇనుముల ప్రదీప్, ఇనుముల శ్రీకాంత్ లు పాల్గొన్నారు