Saturday, July 27, 2024
Homeతెలంగాణఒక్కసారి అవకాశం ఇవ్వండి మంథని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చుపిస్తా

ఒక్కసారి అవకాశం ఇవ్వండి మంథని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చుపిస్తా

ఒక్కసారి అవకాశం ఇవ్వండి మంథని నియోజక వర్గాన్ని  అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చుపిస్తా

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్

మంథని సెప్టెంబర్ 11( కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్ల పల్లి గ్రామస్తులు సుమారు 100 మంది మహిళలు, యువత బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీ లో చేరారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ మంథని ప్రాంతంలో అవినీతి అరాచక పాలన అంతం కావాలంటే ప్రజలందరూ కొత్త నాయకత్వాన్ని కోరుకోవాలని 40 సంవత్సరాలు శ్రీధర్ బాబు,పది సంవత్సరాలు పుట్ట మధు ఇక్కడ పాలించిన పేద ప్రజల జీవితాలు ఎటువంటి అభివృద్ధి జరగలేదు కేవలం వారి అనుచరులకు, నాయకులకు కార్యకర్తలకు సంక్షేమ అభివృద్ధి పథకాలను చెందాయని,మూడుసార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి చేసిన శ్రీధర్ బాబు ఇందిరమ్మ ఇళ్లలో వందల కోట్ల అవినీతిని చేశారని, అనేక పదవులు అనుభవించిన పుట్ట మధుకర్ వేల కోట్ల అవినీతి సొమ్మును సంపాదించాడు తప్ప ఈ ప్రాంతానికి ఒక హాస్పిటల్, ఇండస్ట్రీ, కళాశాల కల్పించలేక మంతిని ప్రాంతాన్ని అంధకారం చేశారని,పక్కన ఉన్న రామగుండం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందినప్పుడు, ప్రధాని, స్పీకర్, మంత్రి ఎన్నికైన మంథని ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదని,తెలంగాణ ఉద్యమంలో జీవితాన్ని త్యాగం చేసి పాల్గొన్న నాకు టికెట్ ఇవ్వకుండా డబ్బులకు అమ్ముకొని ఉద్యమకారులను మోసం చేశారు. కెసిఆర్,దళిత బంధు గృహలక్ష్మి, వంటి పథకాలను కేవలం వారి కార్యకర్తలకు ఇస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చెందే విధంగా ఉంటాయని ఈ ఒక్కసారి బిజెపి పార్టీకి అవకాశం ఇచ్చి మంథని ప్రాంతం కూడా మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోతార వేణి క్రాంతికుమార్,మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్, మండల ఇన్చార్జి తోట మధుకర్, మంతిని పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి,మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు బొసెల్లి మౌనిక,ఉపాధ్యక్షులు రేపాక శంకర్,బూత్ అధ్యక్షులు ఎలాకుర్తి సురేష్,మండల నాయకులు బడుగు శ్రీనివాస్, మాదారబోయిన కుమారస్వామి,సీనియర్ నాయకులు బోసెల్లి శంకర్, గురువేష్,కూరమ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!