కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం
సుల్తానాబాద్, అక్టోబర్ 08(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణరావు పల్లె లో సీసీ రోడ్డు నిర్మాణానికి, ఈ పంచాయతీ భవనాన్ని సర్పంచ్ మోలుగురి వెంకటలక్ష్మి అంజయ్య గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి, సుల్తానాబాద్ ఎంపీపీ బాలాజీ రావు కి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న గ్రామపంచాయతీ అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సహకారం తో గ్రామపంచాయతీ భవనాన్ని ఈ పంచాయతీ భవనాన్ని 15 లక్షల వ్యయంతో నిర్మించి, అలాగే నారాయణరావు పల్లెలో పలు సిసి రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెల్కల రామచంద్రారెడ్డి, వార్డు సభ్యులు గుర్రం మల్లేశం, మొల్గురి రాజేశ్వరి సత్తయ్య, కళ్లెం శారద, కన్నం అంజయ్య, వడ్లకొండ రాములు, గ్రామ నాయకులు మొలుగూరి ప్రశాంత్, మోలుగురి ఎల్లయ్య, టిఆర్ఎస్ నాయకులు మొలుగూరి అంజయ్య గౌడ్, గ్రామ కార్యదర్శి వేముల సురేష్, గుర్రం సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.