ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో రాణించాలి
పల్ల అపర్ణ సురేష్ ప్రమాణ స్వీకారోత్సవ సభలో జిల్లా అధ్యక్షులు కోలేటి రమేష్
సుల్తానాబాద్, అక్టోబర్ 8(కలం శ్రీ న్యూస్):ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కోలేటి రమేష్ అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవన్ లో నూతనంగా జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికైన పల్ల అపర్ణ సురేష్ ల ప్రమాణ స్వీకారోత్సవ సభ జరిగింది. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోలేటి రమేష్ , జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లంకి లింగమూర్తి ,ఉమ్మడి జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ వంగల వెంకటనారాయణ, జిల్లా ఎన్నికల అధికారి కొమురవెల్లి రాజేందర్, రాష్ట్ర నాయకులు మొగిలపల్లి కృష్ణమూర్తి, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు పెద్ది వెంకటేష్,, జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా ప్రధాన కార్యదర్శి పద్మ , కోశాధికారి శ్రావణి లు పాల్గొన్నారు, స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులు మాడురి ప్రసాద్, అనగం వెంకట్రాజం ,చకిలం మారుతి, అల్లంకి సత్యనారాయణ, పల్ల మురళీధర్, శివనాత్రి ప్రసాద్, పల్లా శ్రీనివాస్, సముద్రాల దర్మేందర్, కాసం సత్యనారాయణ, అల్లంకి హరీష్ , ఎల్లంకి రాజన్న , మహిళా నాయకులు రామిడి హాసిని, పల్లా వనిత, బాదం వాణి, అల్లెంకి స్వాతి లు ప్రమాణ స్వీకారోత్సవ సన్మాన సభలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా ముఖ్య అతిథిలుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ మహిళలు ఇంటికి పరిమితం కాకుండా రాజకీయంలో ను రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య మహిళా జిల్లా అధ్యక్షురాలు పల్ల అపర్ణ సురేష్ దంపతులను ఘనంగా సన్మానించారు.