బడుగు బలహిన వర్గాలకు సముచిత స్థానం బీజేపీ తోనే సాధ్యం
బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 8( కలం శ్రీ న్యూస్ ):మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామం భైరెన్ గడ్డకు చెందిన పలువురు మహిళలు, బెస్త పల్లి గ్రామస్తులు సుమారు 80 మంది ఆదివారం మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్,మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు బోసెల్లి మౌనిక ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.సునీల్ రెడ్డి కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు.అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ మంథని ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనడానికి ఈ చేరికలే నిదర్శనం, బీజేపీ పార్టీ తోనే బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం సాధ్యం,మంథని ప్రాంత ప్రజలు ఒక్కసారి మార్పును కోరుకోండి, కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు మంథనికి చేసిన అభివృద్ధి శూన్యం,ఈసారి బీజేపీ తెలంగాణలో కూడా అధికారం లోకి వస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోతరవేణి క్రాంతికుమార్,మండల ప్రధాన కార్యదర్శి ఆరె ఓదెలు,మండల కోశాధికారి ఎల్క సదానందం,పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి,సీనియర్ నాయకులు కంచు మల్లేష్,కోరబోయిన మల్లికార్జున్, బోసెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.