విద్యా మహోత్సవం విజయవంతం చేయండి:కొండేల మారుతి
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 8( కలం శ్రీ న్యూస్):ఈ నెల 29న జరుగనున్న విద్యా మహోత్సవం విజయవంతం చేయాలని కార్యక్రమ వ్యవహర్త కొండేల మారుతి కోరారు.ఆదివారం మంథని హైస్కూలు 121 వసంతోత్సవాల క్రమంలో ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ మంథని విద్యార్థి యువత కార్యాలయంలో జరిగింది. కొండేల మారుతి అధ్యక్షతన కొనసాగిన సమావేశంలో ప్రసంగించిన వక్తలు మంథని గడ్డపై1903-04 విద్యా సంవత్సరంలో అరంభమైన ప్రభుత్వ విద్య 2023-04 నాటికి 121 సంవత్సరాలు పూర్తవుతున్నాయని అన్నారు. కరీంనగర్ జిల్లా విద్యా చరిత్రలో అత్యాధికులైన విద్యా వంతులు మంథని నుండే విఖ్యాతులైనారని పేర్కొన్నారు.ఇక్కడి గడ్డ పై చదువుకున్న పూర్వ విద్యార్థులు గురువులు విద్యా రంగ సేవలందించిన వారు అభిమానులు పాల్గొని విజయ వంతం చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మంథని పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షులు విద్యా మహోత్సవ నిర్వహక సంఘం సమన్వయ కర్తలు తాటి బుచ్చన్న గౌడ్,పోరెడ్డి వెంకట రెడ్డి,మాడిశెట్టి శ్యాంసుదర్ పాల్గొన్నారు.