మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బొద్దుల
జూలపల్లి, అక్టోబర్ 06(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కపూర్ గ్రామానికి చెందిన తోటపల్లి సంతోష్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా, వారి కుటుంబానికి సహాయం అందించాలని స్థానిక నాయకులు కెసిఆర్ సేవా దళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పద్మశాలి సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జూలపల్లి మండల జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ని కోరగా వెంటనే స్పందించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఇట్టి సహాయం అందించిన జూలపల్లి మండల ముద్దు బిడ్డ, బిసి యువ నాయకులు బొద్దుల లక్ష్మణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు, నాయకులు, గ్రామస్తులు.
ఈ కార్యక్రమంలో కెసిఆర్ సేవా దళం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి చాతళ్ళ కాంతయ్య, బొద్దుల సాయినాథ్, బోళ్ళ అంతయ్య, వేల్పుల గట్టయ్య, కనకయ్య, శంకరయ్య, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.