Wednesday, May 29, 2024
Homeతెలంగాణపేద ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది

పేద ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది

పేద ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది

జీవో 58 ద్వారా నిరుపేదలకు భరోసా

61 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సుల్తానాబాద్, అక్టోబర్ 06(కలం శ్రీ న్యూస్):పేద ప్రజలకు బిఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచి జీవో 58 ద్వారా ఉచిత పట్టాల పంపిణీ చేపడుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఛైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వం 58 జివో కింద 61 మంది లబ్ధిదారులకు ఉచిత ఇంటి పట్టాల పంపిణీ చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు నిత్యం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందుల ద్వారా అన్ని వర్గాలను ఆదుకుంటూ ముందుకు పోతున్నారని, ప్రభుత్వ స్థలాలలో గృహాలు నిర్మించుకున్న నిరుపేదలకు పట్టాలను అందించే బహత్రర కార్యక్రమాన్ని చేపడుతూ పాలన సాగిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, రహదారుల నిర్మాణాన్ని చేపడుతూ, ఎన్నికలలో ఇచ్చిన హామీలే కాకుండా, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ, ప్రతి నిరుపేద ఆనందంగా జీవించేలా పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు పట్టా కాగితాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, ఆర్థివోమధుమోహన్, ఎమ్మార్వో మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ టి మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర మౌనిక శ్రీనివాస్ ,కౌన్సిలర్లు మమత సంపత్, పారుపల్లి జ్ఞానేశ్వరి గుణపతి, కూకట్ల గోపి, చింతల సునీత రాజు, గొట్టం లక్ష్మి మల్లయ్య, అనుమల అరుణ బాబురావు, రేవెల్లి తిరుపతి, గుర్రాల శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్ రావు, నాయకులు తిప్పారపు దయాకర్ తో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!