సీఎం బ్రేక్ ఫాస్ట్ బృహత్తర పథకం…పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి
పెద్దపల్లి,అక్టోబర్06(కలం శ్రీ న్యూస్):విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ ఫాస్ట్ బృహత్తర పథకమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి సీఎం అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పథకం వల్ల రాష్ట్రంలో 23 లక్షల మంది విద్యార్థులకు మేలు జరగనుందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, ఇప్పటికే పాఠశాలల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం కొనసాగుతుందని దీనికి అల్పాహారం తోడైందన్నారు. నిరుపేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రారంభించినందుకు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా – ప్రశాంత్ రెడ్డి, కౌన్సిలర్ లు,జిల్లా విద్యాధికారి మాధవి, మున్సిపల్ కమీషనర్, అధికారులు , జిల్లా విద్యాధికారులతోపాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.